డ్రైనేజీలో భారీ కొండ చిలువ కనిపించడంతో స్థానికులు పరుగులు పెట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. గ్రామానికి సమీపంలో ఓ డ్రైనేజీ కాలువ నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో ఈ భారీ కొండచిలువ బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్రామానికి సమీపంలోని ఓ డ్రైనేజీ కాలువ నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో ఈ భారీ కొండచిలువ బయటపడింది. అనుకోని అతిథిని చూసిన రైతు ఒక్కసారిగా షాక్‌కు గురికాగా, విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఆ కొండచిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని స్థానికలు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. అయితే.. గ్రామంలో తరచూ డ్రైనేజీ కాలువల్లో వన్యప్రాణులు కనిపిస్తున్నాయని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.