First Look Launch: దర్శకుడు దశరథ్ కథతో ‘లవ్ యూ రామ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో దర్శకులు తమ మిత్రుల కోసం నిర్మాతలుగా మారుతున్నారు. అలానే తమ శిష్యుల కోసం, స్నేహితుల కోసం కథలనూ అందిస్తున్నారు. అలా ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ తన స్నేహితుడు డి.వై. చౌదరి తెరకెక్కిస్తున్న సినిమా కోసం కథను అందించడంతో పాటు తానూ నిర్మాణ భాగస్వామిగా మారారు. అదే ‘లవ్ యూ రామ్’! ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్ హీరోగా నటిస్తుండగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
శనివారం మేకర్స్ ఫస్ట్ లుక్, సినిమా థీమ్‌ను తెలిపే వీడియోను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని డైరెక్టర్ వి.వి. వినాయక్ లాంచ్ చేయగా, థీమ్ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్. రమణ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రోహిత్, అపర్ణల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో అపర్ణ చాలా అందంగా కనిపించగా, రోహిత్ హ్యాండ్సామ్ గా కనిపించాడు. థీమ్ మ్యూజిక్, విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా వున్నాయి. ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, ”దశరధ్ మంచి స్నేహితుడు. ఇష్టమైన వ్యక్తి. తన కథ రాసి చౌదరిగారితో కలసి తొలిసారిగా ప్రొడక్షన్ లోకి వచ్చారు. మన స్టూడియో పెట్టి డివై చౌదరి గారు గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. హీరో, హీరోయిన్లు చక్కగా ఫెర్ ఫార్మ్ చేశారు. బెనర్జీ గారి పాత్ర కొత్తగా వుంటుంది. అందరూ చక్కగా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు. దశరధ్ మాట్లాడుతూ, ”నేను చేసిన ప్రతి కథ ఓ ముగ్గురికి చెబుతాను. అందులో వినాయక్ గారు ఒకరు. ఆయన ఇచ్చిన అద్భుతమైన సూచనలతో ఈ కథ చేశాం. ఆయనకి కృతజ్ఞతలు. అలాగే గోపి మోహన్, హరికృష్ణ గారు నాపై వున్న ప్రేమతో అన్ని రకాలుగా సహాయం చేశారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. డివై చౌదరి నాకు చిన్నప్పటి ఫ్రండ్. మా ఇద్దరిదీ ఒకటే ఊరు. ఇండస్ట్రీకి వచ్చాక కూడా పాతికేళ్ళుగా ఫ్రెండ్స్ గా ఉంటున్నాం. తనతో కలసి ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం చాలా మంది ప్రతిభ గల యువకులు పని చేశారు. స్క్రీన్ ప్లే కిషోర్ గోపు, శివ అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాస్తున్నారు. ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కె. వేద మంచి మ్యూజిక్ ఇచ్చారు” అని అన్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
డి. వై. చౌదరి మాట్లాడుతూ, ”దశరధ్ చాలా స్ఫూర్తిని నింపే కథ చెప్పారు. ఇవాళ్టి జనరేషన్ కు కావాల్సిన సందేశం ఇందులో వుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే అమ్మాయి, నమ్మించమే జీవితం అని భావించే అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇందులో దశరధ్ బ్రాండ్ కనిపిస్తుంది.మారేడుమిల్లి, ఖమ్మం, నార్వే లాంటి ప్రదేశాల్లో షూట్ చేశాం” అని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు రోహిత్ బెహల్, అపర్ణ జానర్దనన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, కార్టూనిస్ట్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?