Khudiram Bose: పార్లమెంట్ సభ్యుల కోసం నేడు ప్రత్యేక ప్రదర్శన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khudiram Bose: ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒకరు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు ఖుదీరామ్ బోస్. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.వి.ఎస్. రాజు దర్శకత్వంలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగర్లమూడి టైటిల్ పాత్రలో నటించారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది. విశేషం ఏమంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించబోతున్నారు. న్యూఢిల్లీ మహదేవ్ రోడ్‌లోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. దీనికి సంబంధించి ఫిల్మ్స్ డివిజన్ అన్ని ఏర్పాట్లు చేయాల్సిందని మినిస్టరీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్ ఇందు ఆదేశాలను జారీ చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేష్ బాధ్యతలను నిర్వహించగా బాలాదిత్య రైటర్‌గా వర్క్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!