Anand Ravi: ‘కొరమీను’ మీసాల రాజుకు చిక్కిందా!? చేజారిందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koramenu: ఆనంద్ రవి, శత్రు, హరీశ్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘కొరమీను’. ఈ నెల 31న ‘కొరమీను’ విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం సినిమా ట్రైలర్ ను యువ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేశారు. ”విజయవాడలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజు అలియాస్ సీతారామరాజు విశాఖ పట్నం సిటీకి ట్రాన్స్‌ఫర్స్ అయ్యారు” అనే న్యూస్ ఛానెల్ వార్తతో ‘కొరమీను’ ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడ నుండి మీసాల రాజుగా పేరున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ మీసాలు లేకుండా విశాఖ లోకి ఎలా అడుగుపెట్టాడు అనే క్యూరియాసిటీని వ్యూవర్స్ లో పెంచారు. ఇక విశాఖ నగరంలోని జాలరి పేటలో డ్రగ్స్ గొడవ మీసాల రాజుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. ఆ ప్రాంతానికి డాన్ అయిన కరుణకు అతని రైట్ హ్యాండ్ గా ఉండే కోటికి మధ్య గొడవ వచ్చి ఇద్దరూ విడిపోతారు. సో… కరుణ ఆగడాలను అడ్డుకోవడానికి మీసాల రాజు… కోటి హెల్ప్ తీసుకుంటాడా? లేదా? అసలు కరుణకు, కోటికి మధ్య ఎందుకు వైరం వచ్చింది? అనేదే ‘కొరమీను’ చిత్ర కథ అని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య తలెత్తిన ఇగోసే ఈ సినిమా కథకు మూలం.
‘ప్రతినిధి’కి రచన చేసి, ‘నెపోలియన్’ మూవీలో టైటిల్ రోల్ పోషించిన ఆనంద్ రవి… ఇందులో కోటి పాత్రను పోషించాడు. మీసాల రాజుగా శత్రు, కరుణ గా హరీశ్ ఉత్తమన్ నటించారు. మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ఆనంద్ రవి అందించగా, శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించారు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..