అప్పట్లో 'గాడ్ ఫాదర్' వెనుకే వచ్చిన 'కాంతార' విజయం సాధించినట్టుగానే, ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' వెనకే వస్తున్న 'మాలికాపురం' కూడా ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ సక్సెస్ సాధిస్తుందనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.
మలయాళ సూపర్ హిట్ మూవీ 'మాలికా పురం' తెలుగులో అనువాదమౌతోంది. ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.
మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఏటీఎం'. ఈ వెబ్ సీరిస్ ఇదే నెల 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.
శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న సినిమా 'భూతద్దం భాస్కర్ నారాయణ'. పురుషోత్తం రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మార్చి 31న జనం ముందుకు రాబోతోంది.
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న నటుడు అరవింద్ కృష్ణ తాజాగా ఓ వెబ్ సీరిస్ లో నటించాడు. 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' పేరుతో తెరకెక్కిన ఈ సీరిస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
ఒక్కోసారి అతి మంచితనంతో వ్యవహరించడం కూడా మంచిదేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలను విమర్శించడం కంటే... వాటి నిర్ణయాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుందని, క్షణికావేశంలో విమర్శలు చేస్తే, మనల్ని నమ్ముకున్న నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని, కాబట్టి తన మాటలను అతి మంచితనంగా ఎవరైనా వ్యాఖ్యానించినా తాను బాధపడనని చిరంజీవి చెప్పారు.