Michael: ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. ఈ మూవీ కోసం అద్భుతంగా ట్రాన్స్ ఫర్మెషన్ అయిన సందీప్ కిషన్ యాక్షన్-ప్యాక్డ్ టీజర్ తో అదరగొట్టాడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 3న సినిమాను ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు దీనికి నిర్మాతలు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ విలన్ గా నటిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీత దర్శకుడు.