Anand Deverakonda: ‘బేబీ’తో సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్ టాలీవుడ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్. నిర్మించారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య విడుదల చేసిన “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” లిరికల్ సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి గొప్ప స్పందన వచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ గీతం ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఇక అంతకు మించిన మెలోడీతో మరో పాటతో సిద్ధమైంది ‘బేబీ’ మూవీ టీమ్. ఈ పాటను మలయాళంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాల్ చేత పాడించింది. అంతేకాదు… ఆర్య దయాల్ దీనిని పాడుతుండగా వీడియోగానూ చేశారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సింగర్ చేత చేయించిన లిరికల్ వీడియో పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, “‘బేబీ’ ఫస్ట్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో 20 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అందుకే తర్వాతి పాటను అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మలయాళీ సింగర్ ఆర్య దయాల్ చేత పాడించాం. తన ప్రైవేట్ సాంగ్స్, యూ ట్యూబ్ షాట్స్, ఇంతకు ముందు పాడిన పాటలకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. నేను కూడా తనకు అభిమానిని. ఈ పాటను మా మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి తన కోసమే కంపోజ్ చేశాం. తనతోనే పాడించాలని నిర్ణయించుకున్నాం. ఈ పాట మొదటి పాటకు ఏ మాత్రం తీసిపోదు. ఇక ఫస్ట్ సాంగ్ కు మించి ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఓ పాటకు పెట్టాల్సినంత బడ్జెట్ ను ప్రమోషనల్ మ్యూజికల్ వీడియోకే పెట్టాం. ఆర్యదయాల్ మొదటి పాట నా సినిమాలోనిది కావడం గర్వంగా ఉంది. ఈ పాట తర్వాత తెలుగు ప్రజలు తన వాయిస్ తో ప్రేమలో పడతారని ఖచ్చితంగా చెప్పగలను” అని అన్నారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకూ మీడియా వారికి ఆన్ సెట్స్ కు వచ్చి కవర్ చేయడం ఉండేది. మొదటిసారిగా ఓ అప్ కమింగ్ స్టార్ సినిమాకు లిరికల్ వీడియోకు సెట్ వేసి సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకు కారణం ‘బేబీ’ సినిమా మొదటి పాటకు వచ్చిన రెస్పాన్సే. ఈ రెండో లిరికల్ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఈ పాట కోసం ఆర్య దయాళ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. భాషను అర్థం చేసుకుని పాడింది. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు ఓ హై మూమెంట్ వస్తుంది. చాలా ఎక్స్ పీరియన్స్డ్ డైరెక్టర్ లా సాయి రాజేశ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు” అని చెప్పారు. సింగర్ ఆర్య దయాల్ మాట్లాడుతూ, “ఈ పాట కోసం ఇంత మంచి తెలుగు భాష నేర్చుకోవడం సంతోషంగా అనిపించింది. రికార్డింగ్ అంతా చాలా ఫన్నీగా జరిగింది. టీమ్ లోని ప్రతి ఒక్కరూ సహనంతో నాకు అన్నీ నేర్పించారు. నాలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు టీమ్ మొత్తం బాగా కృషి చేసింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ ” అని చెప్పింది. ఈ కార్యక్రమంలో కో-ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని కూడా పాల్గొన్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!