Gagan Vihari: దేశభక్తి, దైవభక్తి నేపథ్యంలో ‘గాంగేయ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Gaangeaya’: టి. హేమ కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘గాంగేయ’. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ నిర్వర్తిస్తున్నారు. గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం. విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర దర్శకులు మాట్లాడుతూ, ” రామానాయుడు గారిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను నిర్మిస్తున్నాం. జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా కుల మత బేధాలు లేకుండా మనిషి మనిషిని ప్రేమిస్తేనే శాంతి చేకూరుతుందనే పాయింట్ మీద ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో నిర్మిస్తున్నాం” అని అన్నారు. నిర్మాత టి. హేమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ”అందరి సహకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. చాలా మంచి కథతో ఈ సినిమా రాబోతోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
హీరో గగన్ విహారి మాట్లాడుతూ, ”అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా ఇది. దైవభక్తి, దేశభక్తి, ప్రేమ.. ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మంచి సినిమాను తీయాలని మా నిర్మాతలు ఎంతో కష్టపడుతున్నారు. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి” అని అన్నారు. తనకిది తెలుగులో మొదటి చిత్రమని, కథ ఎంతో బాగుందని హీరోయిన్ అవ్యుక్త తెలిపింది.
Also Read
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!