గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి..
కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు.
Minister KTR: దళితుల బందు అవసరం ఇంకా లక్షల్లో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మేలు జరిగేలా దళిత బంధు అందజేస్తామన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు.
Gandhi Temple: జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులను ఏకం చేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. నేడు ఆయన జయంతి (అక్టోబర్ 2) మరియు దేశం మొత్తం మహాత్ముని త్యాగాలను స్మరించుకుంటుంది.
Election Commission: అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమైంది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 3న రాష్ట్రానికి రానుంది.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది.
KTR: దళితులకు సాధికారత కల్పించడంలో జలమండలి తనదైన పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా జలమండలి 162 మురుగునీటి రవాణా వాహనాలను లబ్ధిదారులకు అందజేస్తోంది.
Kacheguda to Raichur: కాచిగూడ-రాయచూర్ డెము రైలు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు 29 స్టేషన్లలో ఆగుతుంది.