గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి.. ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారు.. నేను పుట్టి పెరిగినా తిరుపతిలో స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది అని మంత్రి రోజా పేర్కొన్నారు.
స్వాతంత్ర్య అమరవీరులను ప్రతిరోజు గుర్తించుకోవాలి అని మంత్రి రోజా తెలిపారు. తిరుపతి, విజయవాడ, వైజాగ్ లు కూడా అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ ఏర్పాటు చేస్తాం.. అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ ఒక గోడ కాదు ఒక గుడిలా భావించాలి.. మహాత్మ గాంధీ కోరుకున్నట్లు గ్రామాలలో స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అయ్యింది అని ఆమె అన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: మార్క్స్, గాంధీ సిద్ధాంతాలు చదివి జగన్ పాలన చేస్తున్నారని నేను అనను..
చంద్రబాబు, భువనేశ్వరి ఎదో త్యాగం చేసినట్లు దీక్ష చేస్తున్నారు అని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గం.. ఎన్టీఆర్ నుండి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి బాబు.. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను పట్టించుకోవడం లేదు అని ఆమె అన్నారు. సానుభూతి కూడా రాదు.. మాకు 15 సీట్లు రావడం కాదు, పవన్ కు 15 సీట్లకైనా కనీసం అభ్యర్ధులు ఉన్నారా.. మాకు 175 స్దానాలకు అభ్యర్ధులు ఉన్నారు.. మళ్ళీ జగనే సీఎం.. మహిళా గౌరవించాల్సిన బాద్యత అందరిపైనా ఉంది.. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా, అవమానించేలా మాట్లాడుతూన్నారు.. ఇలాంటి వారికి న్యాయస్థానంలో శిక్ష పడుతుంది అని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.