Kacheguda to Raichur: నేటి నుంచి కాచిగూడ-రాయచూర్ డెమో.. 29 స్టేషన్లలో ఆగనున్న ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kacheguda to Raichur: కాచిగూడ-రాయచూర్ డెమో రైలు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు 29 స్టేషన్లలో ఆగుతుంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, కర్ణాటక మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. కాచిగూడ-యశ్వంతపుర మధ్య వందే భారత్ రైలు కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతి గురువారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రెండు నగరాల మధ్య రైలు నడుస్తుండగా, ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉందని అధికారులు తెలిపారు. తాజాగా, కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త అందించింది, కాచిగూడ-రాయచూర్ డెము రైలు నేటి (అక్టోబర్ 2) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 9.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు రాయచూరు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణానికి దాదాపు 5.40 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయచూర్‌లో బయలుదేరి రాత్రి 9.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. డెము రైలు వాజానగర్, షాద్ నగర్, మహబూబ్ నగర్, దేవరకద్ర, జక్లేరే, మక్తల్, కృష్ణా స్టేషన్ల మీదుగా రాయచూర్ చేరుకుంటుంది. మొత్తం 29 స్టేషన్లలో రైలు ఆగుతుందని వెల్లడించారు. రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
CM Jagan: మహాత్మా గాంధీ గారి మార్గంలోనే నడుస్తున్నాం..
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..