Postal Department: హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం పోస్టల్ శాఖ రూ. 20 వేల జరిమానా విధించారు. తన పార్శిల్ తారుమారు అయ్యిందని, కొన్ని వస్తువులు కనిపించకుండా పోయాయంటూ కస్టమర్ ఫిర్యాదు మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం ఆ కస్టమర్‌కు రూ.20,000 పరిహారం చెల్లించాలని ఇండియా పోస్ట్‌ను ఆదేశించింది.
మహాత్మ గాంధీ జయంతి రోజున ఒక్క రోజుకు నారా భువనేశ్వరి దీక్షకు దిగింది. సాయంత్ర 5గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు. ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు కూడా దీక్ష చేస్తున్నారు. నారా భువనేశ్వరికి మద్దుతుగా చంద్రబాబు, నారా లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ దీక్ష చేస్తున్నారు.
దీక్ష చేసే ముందు ఎంత వరకు మన అర్హత ఉందో చూసుకోవాలి అని స్పీకర్ తమ్మనేని సీతారం అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపొతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. అది వాళ్ళ ఇష్టం.. తప్పు చేసి మోసం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఎన్నికలలో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారు.
Talasani: ఇటువంటి ఇల్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు.
అయ్యా పవన్ కళ్యాణ్ ... ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి?.. బీజేపీతో ఉన్నట్లా? లేనట్లా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అనైతిక, విశ్వాస రహిత రాజకీయ.. బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడు.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే.. ఒక పెళ్ళి చేసుకుని మరొక ఆమెతో బంధం నడిపావు..
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన జాతి పిత మహాత్మాగాంధీ అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిపాలన అందించిన లాల్ బహుదూర్ శాస్త్రి, ఇద్దరికి కాంగ్రెస్ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి జాతీయ జెండా ఇచ్చిన నేల మీద గాంధీ జయంతి చేసుకోవడం నా అదృష్టం అని ఆయన వ్యాఖ్యనించారు.