కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పై పై పూతలు కాకుండా కింది స్థాయి నుంచి మార్పులు తీసుకుని వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్ళుగా నిశ్శబ్ద విప్లవం నడుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్ర స్థాయిలో సీఎం జగన్ పాలనను ఎలా అందిస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఫలితాలు ఎలా ఉన్నాయో మనకు అర్థం అవుతున్నాయి.. జగనన్న సురక్షా ద్వారా 90 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయని ఆయన చెప్పారు. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది అని సజ్జల తెలిపారు.
Read Also: Minister KTR: దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారు
ఇవన్నీ గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వల్లనే సాధ్యం అవుతోంది వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మొత్తం ప్రక్రియకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు అవుతోంది.. గ్రామ ప్రొఫైల్స్ కూడా తయారు అవుతున్నాయి.. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా కలగన్నామా? అని సజ్జల రామకృష్ణారెడ్డి అడిగారు.