Election Commission: అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమైంది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రేపు (ఈ నెల 3)న రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్‌కృష్ణలో బస చేయనున్నారు. అక్కడ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమావేశం కానున్నారు. సీఈసీ బృందం రాకతో త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రానికి వస్తున్న ఎన్నికల అధికారుల బృందంలో ఎన్నికల కమిషనర్లు అనుపచంద్ర పాండే, అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అజయ్ భాదు, హిర్దేశ్ కుమార్, ఆర్కే గుప్తా, మనోజ్ కుమార్ సాహు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, సన్నాహాలను ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ఈ బృందం చీఫ్ సెక్రటరీ, డీజీపీతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనుంది. పర్యటన ముగిశాక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారు.
KTR: వ్యర్థాల వాహనాలు.. నేడు లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్