టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. రూ.1064 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నామా నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని విదేశీ కంపెనీలకు మళ్లించారని అభియోగాలు వచ్చాయి. నామాతో పాటుగా రాంచి ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజ ఇళ్లపై కూడా ఈడీ దాడులు చేసింది. అటు 2019లో నామాపై సీబిఐ కేసు […]
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈనెల 14 వ తేదీన ఈటల ఢిల్లీవెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటుగా మరికొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగానే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేవరయాంజల్ లో భూములను ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు […]
కరోనా సమయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు. నేను, నా కుటుంబం బతికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇలాంటి సమయంలో ఓ మహిళ తన వీపుపై కరోనా రోగిని ఎక్కంచుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళ నిహారిక మామ కరోనా బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్నది. నగోల్ నగరం సమీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో […]
అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్‌కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ […]
ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఓ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి తప్పిపోయింది. తప్పిపోయిన యువతి కోసం తల్లిదండ్రులు పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అయితే, అలా తప్పిపోయి యువతి ఐదేళ్ల తరువాత తిరిగి ఇంటికి వస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని గుమ్మల లక్షీపురం మండలంలోని టిక్కబాయి గ్రామానికి చెందిన జయసుధ అనే యువతి మతిస్థిమితం లేక పుదుచ్చెరి వేళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయింది. రైల్వే […]
గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంత వరకు కంట్రోల్ కాలేదు. ఇక ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 130 కోట్లమంది ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నా కొందరు భయాలతో, అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు. పైగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు వారికి కరోనా సోకిందని, చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లి […]
మేషం : ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు […]
బాల్యం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. చిన్నతనంలో ఏం చేసినా దానిని ఇష్టపడతాం. కొంత మంది పిల్లలు టీవీ చూస్తూ, మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, ఈ బుడ్డోడు పార్క్ లో అందరి మద్య పెద్దవాళ్లతో కలిసి వాళ్లు చేస్తున్న విధంగా రిథమిక్ గా స్టెప్పులు వేస్తూ మెప్పించాడు. ఈ వీడియోను అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆటగాడు రెక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. బుడ్డోడి స్టెప్పులను చూసిన నెటిజన్లు […]