ఏపీలో కర్ఫ్యూ సడలింపుల సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయం పొడిగించడంతో దూరప్రాంతాలకు ఆర్టీపి బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి దూరప్రాంతాలకు సర్వీసులను ప్రారంభించారు. విజయవాడ నుంచి విశాఖ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంధ్యాలకు ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం వరకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేసింది. కరోనా కేసుల కారణంగా గత కొంత కాలంగా రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో సడలింపుల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.