ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఓ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి తప్పిపోయింది. తప్పిపోయిన యువతి కోసం తల్లిదండ్రులు పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అయితే, అలా తప్పిపోయి యువతి ఐదేళ్ల తరువాత తిరిగి ఇంటికి వస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని గుమ్మల లక్షీపురం మండలంలోని టిక్కబాయి గ్రామానికి చెందిన జయసుధ అనే యువతి మతిస్థిమితం లేక పుదుచ్చెరి వేళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్లో ఆమెను కొందరు చేరదీశారు. అయితే, అమె ఊరు పేరును చెప్పలేకపోయింది. మతిస్థిమితం తగ్గన తరువాత యువతి గుమ్మలక్ష్మిపురం, కురుపం, చినమేరంగి తదితర గ్రామాల పేర్లను చెప్పగా, గూగుల్ మ్యాప్ ద్వారా యువతి చిరునామా గుర్తించారు. ఈ విషయం పోలీసుల ద్వారా యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు.