ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.45,740కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది. చాలా రోజుల తరువా 24 క్యారెట్ల బంగారం […]
కరోనా నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నేను దేశాధ్యక్షుడిని నాకు ఈ రూల్స్ వర్తించవు అంటే కుదరదు. అధ్యక్షులైనా సరే నిబంధనలు పాటించకుంటే ఇదిగో ఇలా జరిమానా కట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి బ్రెజిల్ ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రజారోగ్యంపై దృష్టిసారించినప్పటికీ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో అభివృద్ధి ఆగిపోతుందనే పేరుతో పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా కరోనా విలయతాండవం చేయడంతో హడావుడిగా లాక్‌డౌన్ వంటివి చేసినప్పటికీ […]
బ్రిటన్‌లో జీ7 దేశాల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. అమెరికా, బ్రిటన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా సదస్సులో పాల్గోన్న అనంతరం ఇరు దేశాల అధిపతులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోసం ప్రత్యేక బహుమతిని తీసుకొచ్చారు. పూర్తిగా చేత్తో తయారు చేసిన సైకిల్‌ను ఆయనకు బహుకరించారు. ఈ సైకిల్‌పై బ్రిటన్ జెండా గుర్తు ఉంటుంది. పూర్తిగా చేత్తో తయారు చేసిన ఈ సైకిల్ ఖరీదు […]
జీ7 దేశాలకు చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఊహాన్‌లోని ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అప్పట్లో ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రపంచం పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు బలం చేరూరుతున్నది. ప్రస్తుత అధ్యక్షకుడు జో బైడెన్ కూడా చైనాపై ఉక్కుపాదం మోపేందుకు జీ 7 సదస్సును వేదికగా చేసుకున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు […]
బ్రిటన్‌లో ఈనెల 21 నుంచి లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో బయటపడిన వేరియంట్‌లు తగ్గుముఖంపట్టగా, ఇప్పుడు ఆ దేశాన్ని డెల్టా వేరియంట్ భయపెడుతున్నది. సెకండ్‌వేవ్ సమయంలో ఇండియాను వణికించిన వేరింయంట్ ఇప్పుడు బ్రిటన్‌లో విజృంభిస్తోంది. డెల్టావేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంపై ఆ దేశం ఆంధోళన చెందుతున్నట్టు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం వాయిదా పడే అవకాశం ఉన్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది. బ్రిటన్‌లో మరో నాలుగు […]
చైనా పేరు చెబితేనే ప్రపంచం భయపడిపోతున్నది. చైనాలో కొత్తకొత్త వైరస్‌లు బయటపడుతున్నాయి. రీసెంట్‌గా మరో నాలుగు కొత్త కరోనా వైరస్‌లు బయటపడ్డాయి. ప్రపంచం కరోనాతో ఇబ్బందులు పడుతుంతే, చైనా మాత్రం అభివృద్ది దిశగా పరుగులు తీస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు చైనాలో ఘోరప్రమాదం జరిగింది. చైనాలోని హుబే ప్రావిన్స్ వద్ద గ్యాస్‌పైప్ లైన్ పేలింది. ఈ పేలుళ్లలో 11 మంది మృత్యవాత పడ్డారు. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు […]
జమ్మూ కాశ్మీర్లో శ్రీవారి అలయ నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజను నిర్వహించారు. జమ్మూజిల్లాలోని మజిన్ గ్రామం దగ్గర 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 33.22 కోట్ల రూపాయలతో రెండు విడతల్లో 18 నెలల్లోగా ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్దం చేసింది. తొలి విడతలో 27.72 కోట్ల రూపాయలతో వాహన మండపం, అర్చకులు, ఇతర పాలనా సిబ్బందికి వసతి గృహాలు, తీర్థయాత్రికులకు వేచి ఉండే హాల్స్, ఇతరమౌలిక వసతులు, రహదారులు, […]
బ్రహ్మంగారి మఠాధిపత్యంపై గత కొన్నిరోజులుగా రగడ జరుగుతున్నది. పీఠాధిపత్యం తమకు కావాలంటే తమకు చెందాలని గొడవ పడుతున్నారు. ఈ వివాదంపై అటు వివిధ మఠాలు, పీఠాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఈ వివాదంపై ఈరోజు దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. బ్రహ్మంగారి మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని, దేవాదాయ చట్టంప్రకారం 90 రోజుల్లో వీలునామా అందాలని అన్నారు. పీఠాధిపత్యంపై దేవాదాయశాఖ పరిధిలో విచారణ […]