ఈరోజు నుంచి జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు బ్రిటన్‌లో జరగబోతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లండన్‌కు చేరుకున్నారు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సభ్యదేశాలకు చెందిన అధినేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. జీ7 దేశాల అభివృద్దితో పాటుగా మహమ్మారి కట్టడి, చైనా ప్రాబల్యం తగ్గించడంపై కూడా ఈ చర్చించే అవకాశం ఉన్నది. ఇక ఈ సమావేశాలకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణకొరియా […]
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌ను ఆదుకోవడానికి అమెరికా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు 100 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో అమెరికా కుడా భాగస్వామిగా ఉన్నది. కొవాక్స్ కు అమెరికా 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందివ్వబోతున్నది. ఇందులో నుంచి భారత్‌కు అందాల్సిన వ్యాక్సిన్ వాటాను అందిస్తామని అమెరికా ప్రకటించింది. భారత్ వాటా కింద 80 మిలియన్ వాక్సిన్ డోసులు అందనున్నాయి, […]
రేపు సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యంను పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడున్న రైతుల సమస్యల గురించి అడిగి తెలుకుంటారు. తెలంగాణలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిల, పార్టీకి సంబందించిన జెండా, అజెండాను జులై 8 వ తేదీన ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈలోగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్ షర్మిల సిద్దం అవుతున్నారు. ఇందులో […]
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు. […]
విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుండటంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవలే చెన్నై, హైదరాబాద్‌లో విదేశీ బంగారం భారీగా బయటపడింది. ఇప్పుడు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. షార్జా నుంచి కేరళ వచ్చిన ముగ్గురు లేడీ ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టుగా మార్చి ఆ పేస్టును క్యాప్సుల్స్ లో నింపి, వాటిని మలద్వారంలో […]
ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, అది చేయాల్సి విద్వంసం చేసేసింది. కరోనా మహమ్మారి ధాటికి యూరప్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ఠానంలో ఉండే యూరప్ దేశాలు ఈసారి వాటి స్థానలను కోల్పోయాయి. ఇక, కరోన కట్టడి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాకు చెక్ పెట్టిన న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో […]
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్న దాని ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. నిన్న ఒక్కరోజే కరోనాతో 6,148 మంది మృతి చెందారు అంటే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అన్‌లాక్ ప్రక్రియ అమలు జరుగుతుండటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. సొంత వాహనాల్లో ప్రయాణించేవారికంటే, సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏ వాహనంలో ప్రయాణం చేస్తే ముప్పు ఎంత ఉంటుంది అనే […]
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. 4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. 4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది. అయితే, నిన్నటి డేటా ప్రకారం ఇండియాలో 93,896 కేసులు నమోదవ్వగా, మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాల సంఖ్య 3,59,695 […]