ఒడిశాలోని పూరి రథయాత్రకు ఎంతటి చరిత్ర ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది జులై నెలలో పూరి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కానీ, గతేడాది కరోనా మహమ్మారి కారణంగా రథయాత్రను ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఏడాది సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సెకండ్‌వేవ్ ఉదృతి కారణంగా రథయాత్రను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించారు. రథయాత్రలో 500 లకు మించి సేవకులు పాల్గోనబోరని, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటీవ్ వచ్చిన సేవకులను మాత్రమే సేవలో పాల్గొంటారని, పోలీసు అధికారులకు కూడా ఇదే వర్తిస్తుందని ఒడిశా స్ఫెషల్ రిలీఫ్ కమీషనర్ తెలిపారు. గతేడాది సుప్రీకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ ఏడాది కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు. జులై 12 వ తేదీన రథయాత్ర ప్రారంభం కానున్నది.