అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్‌కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.