చాలా మంది లావుగా ఉన్నామని ఆంధోళన చెందుతుంటారు. బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, ఆత్మన్యూనతను పోగొట్టేందుకు జపాన్‌కు చెందిన బ్లిస్ అనే వ్యక్తి దెబుకారీ అనే సంస్థను స్థాపించి లావుగా ఉన్న వ్యక్తులను అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. లావుగా ఉన్న వ్యక్తులు తమకంటే లావుగా ఉన్న వ్యక్తులను పక్కన ఉంచుకుంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మంత్రం బాగా పనిచేయడంతో జపాన్‌లో ఈ సంస్థకు బాగా పేరు రావడమే కాకుండా మంచి […]
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో నర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయమ్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. దీంతో ఆమెను తిరుపతి స్విమ్స్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పద్మావతి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న జయమ్మ, మెడికల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భయాంధోళనలకు గురయ్యారు. బ్లాక్ ఫంగస్ సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరేమైనా […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఉదయం ఏపీకి మరో 3.60 లక్షల కోవీషీల్డ్ డోసులు గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్డ్‌కు చేరుకున్న డోసులను గన్నవరం వ్యాక్సిన్ నిల్వ […]
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టే పట్టి తిరిగి విజృంభిస్తోంది. మొదటి వేవ్ తరువాత క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకునే సమయంలో సెకండ్ వేవ్ రూపంలో మరింత విజృంబించింది. దీంతో దేశాల పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఎప్పుడూ లేనంతగా పరిస్థితులు మారిపోయాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారు. మొదటి వేవ్ తరువాత సరైన జాగ్రత్తలు తీసుకొకవపోవడం వలనే ఈ పరిస్థితులు తలెత్తాయి. కరోనానుంచి ప్రజలను […]
చైనాలోని వూహాన్ నగరంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఆర్ధికంగా ముందుకు వెళ్తున్నాయని అనుకున్న దేశాలు కరోనాతో ఒక్కసారిగా కుదేలయ్యాయి. కరోనాపై చైనా ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని, కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని అమెరికాతో సహా ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. ఇకపోతే, చైనా పరిశోధకులు మరో భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. 2019 మే నెల నుంచి గత ఏడాది నవంబర్ వరకు అడవిలో సంచరించే గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించి […]
మెక్సికోలోని శాంటామారియా జెకాటేపెక్ లోని ఓ వ్యక్తకి చెందిన పోలంలో సింక్ హోల్ ఏర్పడింది. ఆ సింక్ హోల్ క్రమంగా పెద్దదిగా మారుతూ ఇప్పుడు ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దదిగా మారిపోయింది. ఈ సింక్‌హోల్ కు అనుకొని ఓ ఇల్లు కూడా ఉండటంతో ఆ ఇంట్లోని వ్యక్తులను ఇప్పటికే ఖాళీ చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆ హోల్‌లో రెండు పెంపుడు కుక్కలు కూడా పడిపోయాయి. వాటిని రక్షించాలని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రక్షించడం కుదరదని […]
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగబోతున్నది. ఇప్పటి వరకు యాపిల్, గూగుల్ సంస్థలు స్మార్ట్ వాచ్ యుగాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ కూడా రంగంలోకి దిగుతుండటంతో త్రిముఖపోటీ ఉండే అవకాశం ఉన్నది. ఇతర స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉన్నప్పటికీ, ఇందులో అదనంగా మరికోన్ని ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ వాచ్‌లో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సహాయంతో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా, వెనుక 1080 పిక్సల్ కెమేరా ఉంటుంది. దీని సహాయంతో వీడియోలను […]