కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు ఆక్సోఫామ్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఆక్సోఫామ్ సంస్థ పేదరిక నిర్మూలనకోసం పనిచేస్తున్నది. వైరస్ కారణంగా ప్రపంచంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వివిధ దేశాల్లో అంతర్గత సమస్యలు, అంతర్గత ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. Read: […]
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే ఎకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటే. వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందిస్తున్నాయి. అయితే, మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాలు, డెల్టావేరియంట్ కారణంగా సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటుండటంతో దేశాలు లాక్‌డౌన్‌ను, వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ఏప్రిల్ వరకు ఫిజీ దేశంలో కంట్రోల్ ఉన్న కరోనా, డెల్టావేరియంట్ కారణంగా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కూడా అదే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతలు జల వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వాటాల విషయంలో వివాదం రోజురోజుకు పెరిగిపోతున్నది. జలవివాదంపై నగరి ఎమ్మెల్యే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కేంద్రం […]
పాకిస్తాన్ డ్రోన్ టెక్నాలజీని, నాటో వ్యూహాలను అందిపుచ్చుకోవడం కోసం వెంపర్లాడుతున్నది. ఇందుకోసం టర్కీతో సన్నిహింతంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. పాక్, టర్కీ దేశాల మధ్య మంచి సంబందాలు ఉన్నాయి. ఐరాసాలో పాక్‌కు మద్దతు తెలిపిన అతి తక్కువ దేశాల్లో టర్కీ కూడా ఒకటి. టర్కీ వద్ద బెర్తర్ టీబీ 2 డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లు చాలా ప్రమాదకరమైనవి. వీటి కోసం పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకొని, భారత్ పైచేయి సాధించాలని పాక్ […]
విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ఇప్పటికే వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో పోరాడాలని ఇవాళ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక, కార్మిక సంఘాలు చేస్తున్న నిరసనలకు, ఆందోళనలకు సీపీఐ మద్దతు తెలిపింది. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ […]
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పర్యాటక రంగం ఊపందుకుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా, విధిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్ తీయకూడదని ప్రభుత్వాలు మోరపెట్టుకుంటున్నాయి. అయినా, ప్రజలు షరామామూలుగా మారిపోయారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. తిరిగి అదే నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు నిత్యం టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక దూకుడును పెంచారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకున్నా, ఆ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది. Read: పాత్రల్లో పరకాయప్రవేశం […]