విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ఇప్పటికే వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో పోరాడాలని ఇవాళ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక, కార్మిక సంఘాలు చేస్తున్న నిరసనలకు, ఆందోళనలకు సీపీఐ మద్దతు తెలిపింది. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాన్ని ఉదృతం చేస్తుండటంతో విశాఖ మరోసారి రాజకీయంగా వేడెక్కింది.
Read: తిరుమలలో చిరుత హల్ చల్…