ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వగా, మే చివరి వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. తాజాగా, కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం, ఇండియాలో కొత్తగా 39,796 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229 కి చేరింది. ఇందులో 2,97,00,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,82,071యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక […]
చైనా ప్రతి దేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి అపవాదును తొలగించుకునేందుకు, ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్నదేశాలతో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగన్, తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా తన ఆదీనంలోకి తీసుకుంటానని అంటోంది. టిబెట్ విషయంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించి […]
ప్రచ్చన్న యుద్ధం తరువాత రష్యా ప్రభావం తగ్గిపోవడంతో చైనా బలం పుంజుకుంది. ఆర్ధికంగా, రక్షణ పరంగా బలం పెంచుకుంది. ఒకప్పుడు ఆయుధాలపై ఇతర దేశాలపై ఆధారపడిన డ్రాగన్ ఇప్పుడు ఇతర దేశాలకు ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. గత కొంతకాలంగా చైనా అనుసరిస్తున్న విధానం, దూకుడు, సరిహద్దు దేశాలతో వివాదాలు కలిగి ఉండతటం, కరోనా మహమ్మారికి చైనానే కారణమని అగ్రదేశం అమెరికాతో సహా వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం చైనా రక్షణ […]
కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత పూర్తిగా తగ్గిపోలేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారిలో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. కరోనా నుంచి కోలుకుంటామా? ఈ జబ్బు తగ్గుతుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే సందేహాలు కామన్ గా వస్తుంటాయి. కరోనా తీవ్రత రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. Read: బీజేపీకి శివసేన దగ్గరవుతుందా? ఫడ్నవిస్ వ్యాఖ్యలకు అర్ధం […]
కరోనా తరువాత ఆర్ధిక రంగం క్రమంగా పుంజుకుంటోంది. సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. కరోనా కారణంగా మూతపడిన అనేక రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. గతంలో పుత్తడిపై పెట్టుబడులు పెట్టిన ముదుపరులు, బంగారంలో పాటుగా ఇతర రంగాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు పెరుగుతుండటంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా పుత్తడిపై ముదుపరులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో దేశీయంగా వాటి ధరలు పెరుగుతున్నాయి. ఆరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. […]
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గానికి జరగిన ఉప ఎన్నిక తరువాత జనసేన పార్టీ సైలెంట్ అయింది. కరోనా నిబంధనలు ఎత్తివేస్తుండటంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై నేతలతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జులై 6 వ తేదీన విజయవాడలో పర్యటించబోతున్నారు. విజయవాడలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్, రాష్ట్రంలో ప్రజలు […]
ప్రపంచంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మహమ్మారిని అరికట్టాలి అంతే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారే అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ తెలిపారు. Read: మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్ […]
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శతృవులు కాదు, ఎవరూ శాశ్వత మిత్రులూ కాదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఫైట్ చేసిన శివసేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. బీజేపీకి వ్యతిరేకంగా శివసేన బయటకురావడంతో మరోమాట మాట్లాడకుండా ఉద్ధవ్‌కు జైకొట్టింది కాంగ్రెస్. అయితే, గత కొన్ని రోజులుగా మహా అఘాడి వికాస్‌లో భాగస్వామ్యంగా ఉన్న ఎస్‌సీపీ […]
వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నది. యోగి సర్కార్ వైఫల్యాలు, కరోనా సమయంలో సర్కార్ చేసిన తప్పులు, ప్రజలు పడిన ఇబ్బందులు అన్నింటిని ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని చూస్తున్నది. యూపీ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ యాక్టీవ్ గా ఉండటంతో ఆమెపై రాష్ట్రనాయకత్వం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నది. […]
అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు సాంకేతిక సలహాదారుడిగా ఉంటూ నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రారంభమయ్యాక, ఆయన బాధ్యత మరింత పెరింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 45.3 మిలియన్ల విలువైన షేర్లు ఉండగా, […]