కరోనాకు మొదటగా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన తరువాత వేగంగా ఆ దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజలు పెద్దగా అసక్తి చూపడంలేదు అన్నది వాస్తవం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ స్పుత్నిక్ వీ ని టీకాగా గుర్తించకపోవడమే ఇందుకు కారణం. రెండు డోసుల వ్యాక్సిన్‌పై ఇప్పుడు రష్యా ఆరోగ్యశాఖ కొన్ని […]
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. దాదాపుగా గంటకు పైగా నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్ కాలనీ, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, మాదాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. Read: […]
అమెరికా టెకీ సంస్థలపై రాన్సమ్‌వేర్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు టెకీ కంపెనీలు ఈ రాన్సమ్ వేర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాకు చెందిన హాకర్లు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో యూఎస్ ప్రభుత్వం స్పందించింది. అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రాన్సమ్‌వేర్ దాడులను అడ్డుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. Read: “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే […]
అఫ్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలపాటు ఆఫ్ఘన్‌లో అమెరికా బలగాలు మోహరించి ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేశాయి. ఎప్పుడైతే ఆ దేశం నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే తాలిబన్లు ఆఫ్ఘన్‌లోని కీలక ప్రాంతాలను స్వాదీనం చేసుకోవడం మొదలుపెట్టారు. దక్షిణ ప్రాంతాలపై ఇప్పటికే పట్టుబిగించిన తాలిబన్లు, ఆ ప్రాంతంలో కీలకమైన కాందహార్ ను ఆదీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. Read: […]
అందాల అరకు లోయ చాలా కాలం తరువాత పర్యాటకులతో కళకళలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. ఆంక్షలు క్రమంగా సడలిస్తుండటంతో అన్ని రంగాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. మూడు నెలల క్రితం మూతపడిన పర్యాటక రంగం తిరిగి తెరుచుకున్నది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్ వారాంతపు సెలవులు కావడంతో అరకు వెళ్లి అక్కడ సేదతీరేందుకు పర్యాటకులు […]
భూమిపై కాకుండా విశ్వంలో మరో గ్రహంపై మానవ మనుగడ సాధ్యం అవుతుందా? లేదా అనే విషయాలపై అమెరికాకు చెందిన నాసా సంస్థ అనేక పరిశోధనలు చేస్తున్నది. అయితే, ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంగారక గ్రహంపై ఇప్పటికే నాసా పరిశోధన చేస్తున్నది. సౌరకుటుంబంలోని శని గ్రహానికి చెందిన చంద్రునిపై జీవం ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. Read: వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్ శనిగ్రహానికి […]
పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్‌లపై దృష్టిసారించారు వినియోగదారులు. ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా, వాటిపై వస్తున్న పలు రకాల విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా మైలేజ్, బైక్ రూపం విషయంలోనే ఎక్కువ మంది వెనక్కి తగ్గుతున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రావ్‌టన్ మోటార్స్ సంస్థ క్వాంటా అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఈ బైక్ బ్యాటరీని ఒకసారి రీచార్జ్ చేస్తే 120 […]
కరోనా కారణంగా అనేక దేశాల్లో టూరిజం పూర్తిగా నష్టపోయింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నష్టపోయిన ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని దేశాలకు పర్యాటకరంగం నుంచి అధికమొత్తంలో ఆదాయం వస్తుంది. అలాంటి దేశాలు పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు త్వరితగిన చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ గ్రీన్ వీసా విధానాన్ని అమలులోకి తీసుకురాగా, ఈజిప్ట్ ఈ వీసాను అమలులోకి తీసుకొచ్చింది. ఈజిప్టుకు పర్యాటకం నుంచే అధికఆదాయం లభిస్తుంది. కరోనా కారణంగా […]