తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కూడా అదే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతలు జల వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వాటాల విషయంలో వివాదం రోజురోజుకు పెరిగిపోతున్నది. జలవివాదంపై నగరి ఎమ్మెల్యే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కేంద్రం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని రోజా కోరారు.
Read: మోస్ట్ అవైటెడ్ సిరీస్ “నవరస” వచ్చేస్తోంది !
ఇక చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రైతులను దగా చేశారని, బాబు, లోకేష్‌లు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల కోసం రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం కోవర్టుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారని రోజా విమర్శలు చేశారు.