దేశంలో విమానయాన రంగం మళ్లీ పుంజుకుంటోంది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పౌరవిమానయానం తిరిగి గాడిలో పడింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకున్నాక మరిన్ని ప్రైవేట్ సంస్థలు విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఆకాశ ఎయిర్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ త్వరలోనే భారత్‌లో విమానాలు నడపబోతున్నది. ఆకాశ ఎయిర్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాయాన సంస్థకు పౌరవిమానయాన శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ […]
బాల్య వివాహలపై రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ చట్టాన్ని గవర్నర్ వద్దకు పంపారు. అయితే, రాష్ట్రంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణ వివాహాలతో పాటుగా […]
అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర కొరియా విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటే అణ్వస్త్రాలను పక్కనపెట్టాలని అప్పుడే ఆంక్షల విషయంపై ఆలోచిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర కొరియా మండిపడుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కిమ్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల […]
ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడంతో జైడస్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో […]
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు,బోర్డర్ లో ఉన్నసమస్యలు తగ్గించేందుకు ఇండియా చైనా దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున 13 వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. భారత్ చేసిన సూచనలను చైనా అంగీకరించలేదని, ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ చర్చలు ముగిసిన తరువాత చైనా మరోసారి భారత్ అనుసరిస్తున్న విధానలను, వ్యూహాలపై డ్రాగన్ […]
శ్రీలంకలో ఆహారం కొరత, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యవసర ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రెండు రోజుల్లో 90శాతం మేర పెరిగి రూ.2657కి చేరింది. పాలు, సిమెంట్ సహా అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంగా ఆ దేశంలో ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విదేశీ మారక […]
ఇప్పటి వరకు ప్రతి ఆదివారం రోజున ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్‌డే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద నిర్వహించడానికి పట్టణాభివృద్ధి శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండేఫండే కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందని, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు ఆనందాన్ని వ్యక్తం చేశారని, ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్దకూడా నిర్వహించాలని సూచించారని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ […]
దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అమ్మాయిలను నమ్మించి వల్లో వేసుకోవడం, పెళ్లిళ్ల పేరుతో మోసం చేయడం, ఆ తరువాత అవసరాలు తీర్చుకొని వదిలేయడం చేస్తున్నాడు. ఇలా మోసాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడు రంగసామికి పదేళ్లపాటు కారాగార శిక్షను విధించింది. అనంతపురం జిల్లాకు చెందిన రంగసామి ఉద్యోగం కోసం […]
మేషం :- ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు అనుకూలం. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యలకు బహుమతులు అందజేస్తారు. వృషభం :- పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో […]