దేశంలో విద్యుత్ వినియోగం పెరగడంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ కొరత ఏర్పడటంతో రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నాయి. ఏపీలో విద్యుత్ సమస్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, రాబోయే రోజుల్లో అధికారికంగా విద్యుత్ కోతలు విధించాల్సి రావొచ్చని సజ్జల పేర్కొన్నారు. ప్రజలు వారి ఇళ్లల్లో విద్యుత్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని కోరారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల […]
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓ మూడు అడుగుల విష సర్పం ఒకటి బరబరామని వచ్చి పార్కింగ్ చేసిన స్కాటీలోకి దూరింది. అలా స్కూటీలోకి దూరిన ఆ పామును బయటకు రప్పించేందుకు అక్కడ ఉన్న జనం శతవిధాలా ప్రయత్నం చేశారు. పామును బయటకు రప్పించేందుకు నీళ్లు కూడా పోశారు. అయినప్పటికి ఆ పాము బయటకు రాలేదు. ఎంత ప్రయత్నించినా పాము బయటకు రాకపోడంతో రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన స్నేక్ రెస్క్యూ టీమ్ రెండు […]
దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయి. కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు తగినతంగా విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదు. గతంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే కరోనా కాలంలో బొగ్గుతవ్వకాలు తగ్గిపోయాయి. దీంతో నిల్వలు తగ్గిపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్యవసర […]
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యాతో కలిసి ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని నెలల్లో ఉత్తరాఖండ్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మంత్రి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సంజీవ్ ఆర్య ప్రస్తుతం నైనిటాల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, యశ్‌పాల్ ఆర్య, సంజీవ్ ఆర్యాలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా […]
తమిళనాడులో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. అక్టోబర్ 2 వ తేదీన బురదలో కూరుకొని ఒ నాలుగేళ్ల ఏనుగు మృతిచెందింది. చనిపోయిన ఏనుగు సుమారు 1500 కేజీలు ఉండటంతో… చనిపోయిన ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయించారు. కానీ, ఏనుగు చనిపోయిన ప్రాంతానికి సమీపంలోని గ్రామానికి చెందిన పంచాయతీ బావి ఉన్నది. ఏనుగును అక్కడే ఖననం చేస్తే ఆ ప్రాంతంలోని బావి కలుషితం అవుతుందని గ్రామస్థులు చెప్పడంతో ఏనుగును అక్కడి నుంచి తరలించాలని అనుకున్నారు. […]
తెలంగాణలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణలో సంపూర్ణంగా తిరిగానని అన్నారు. తనను దెబ్బకొట్టేకొద్దీ మరింత ఎదుగుతానని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం ప్రయత్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు […]
దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేయాలని, యువతకు బాధ్యతలు అప్పగించాలని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సీనియర్ నేతలు పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతం కావాలి అంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేపట్టాలి. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అదే విధంగా, రాజస్థాన్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కూడా విభేదాలు […]
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ కోసం వినియోగించే సిరంజీల ఎగుమతులపై మూడు నెలల పాటు పరిమితులు విధించింది. మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది కేంద్రం. దేశంలోని అర్హులైన అందరికి వ్యాక్సిన్ అందించే క్రమంలో సిరంజీల స్టాకును పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్‌లు అందించాలనే లక్ష్యంలో భాగంగానే […]