శ్రీలంకలో ఆహారం కొరత, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యవసర ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రెండు రోజుల్లో 90శాతం మేర పెరిగి రూ.2657కి చేరింది. పాలు, సిమెంట్ సహా అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంగా ఆ దేశంలో ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. దీనికి తోడు కరోనా మహమ్మారి కారణంగా ఆ దేశం మరింత దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోయింది. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. కరోనా కారణంగా పర్యాటక రంగం దెబ్బతిన్నది. దీంతో సంక్షోభం మరింత పెరిగిపోయింది. డిమాండ్‌కు తగినంత సప్లై లేకపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. లీటర్ పాల ధర ఐదు రెట్లు పెరిగి రూ.1195 కి చేరింది. ఇప్పటికే పంచదార, పప్పులకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం ఇలానే కొనసాగితే ప్రజలు మరిన్ని అవస్థలు పడే అవకాశం ఉంటుంది.
Read: ఇకపై చార్మినార్ వద్ద ఆ సంబరాలు…