అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర కొరియా విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటే అణ్వస్త్రాలను పక్కనపెట్టాలని అప్పుడే ఆంక్షల విషయంపై ఆలోచిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర కొరియా మండిపడుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కిమ్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అణ్వస్త్ర, క్షిపణులను తయారు చేసుకున్నామని తెలియజేసింది. మనల్ని నమ్మే వ్యక్తులు లేదా దేశాలు ఉన్నాయా అని నాకు చాలా ఆసక్తిగా ఉంది. వారితో మాకు శత్రుత్వం లేదు.. కానీ, చర్యలను మేము నమ్మడానికి ఎటువంటి ఆధారం లేదని కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొరియాలో అస్థిరతకు అమెరికానే కారణం అని కిమ్ వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై అమెరికా, దక్షిణ కొరియాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Read: జైకొవ్ డి ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే…