మా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. మా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నుంచి తనను తప్పుకోమని చిరంజీవి అన్నారని, ప్రకాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు కదా, విష్ణుని పోటీ నుంచి తప్పుకోమని చెప్పొచ్చు కదా అని మోహన్ బాబుకు చిరంజీవి చెప్పారని మంచు విష్ణు పేర్కొన్నారు. కానీ, ఎన్నికలు జరగాల్సిందే అని నాన్న, నేను అనుకోవడం వల్ల పోటీలో నిల్చున్నానని మంచువిష్ణు తెలిపారు. రామ్ చరణ్ తనకు […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. విష్ణు విజయం సాధించిన తరువాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడిగా విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా మెంబర్స్‌కు సేవ చేసేందుకు తనను ఎన్నుకున్నందుకు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. మా ప్యానల్‌లో అందరూ గెలవక పోవడం నిరాశగా ఉందని అన్నారు. అవతలి ప్యానల్‌లో గెలిచిన మా వాళ్లే అని అన్నారు. నాగబాబు మా కుటుంబ సభ్యులు […]
దేశంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సమస్యలపై వార్తలు వస్తున్నాయి. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, ఈ కోరత ఇంకోన్నాళ్లు ఇలానే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తప్పదని రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, బొగ్గుశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశంలో బొగ్గు కొరత లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను […]
మా కు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్లు పోటీ చేయగా, మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను ఈరోజు ప్రకటించారు. […]
దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. మరో పది రోజులపాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చిన అధికారులు చెబుతున్నారు. అన్నిరాష్ట్రాలు బొగ్గుకొరతను ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో 13 విద్యుత్ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ను ఆచితూచి […]
కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో కరోనాను పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టి జీరో కరోనా దేశంగా గుర్తింపు పొందింది న్యూజిలాండ్. అయితే, ఇటీవలే అక్లాండ్‌లో డెల్టా కేసు ఒకటి బయటపడటంతో వెంటనే దేశంలో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. కాగా, ఇప్పుడు ఇదే విధమైన మరో కఠిన నిర్ణయం తీసుకున్నది న్యూజిలాండ్ […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేషన్లు దాఖలవ్వగా అందులో 9 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో బద్వేల్‌లో 18 మంది బరిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేషన్లు దాఖలవ్వగా, ఇందులో 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. […]
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. పెంచిన విద్యుత్ ఛార్టీల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై మోయలేని భారం పడిందని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ట్రూఅప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని అత్యవసరంగా గాడిన పెట్టాలని, సీఎం ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతీ సభలో చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో […]
తిరుపతిలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి తిరుపతికి చేరుకున్నారు. అనంతరం సీఎం జగన్ బర్డ్‌లో శ్రీ పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ తరువాత అలిపిరి వద్ధ శ్రీవారి పాదాల వద్ద నుంచి నడక మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైకప్పును, గో మందిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. తిరుమలకు చేరుకున్న తరువాత సీఎం బేడి […]