కరోనా కారణంగా విమానాలపై పలు ఆంక్షలు విధించని సంగతి తెలిసిందే. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ విమానాలను నడుపుతున్నారు. కాగా, అక్టోబర్ 18 వ తేదీనుంచి పూర్తి స్థాయి సీటింగ్‌తో విమానాలను నడిపేందుకు పౌరవిమానాయ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో పరిమితిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. మే 25, 2020 న 33 శాతం సీటింగ్‌తో దేశీయ విమానాలకు అనుమతులు ఇవ్వగా, ఆ తరువాత క్రమంగా […]
గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో బంగారం ధరలు పెరగడం కొంత ఇబ్బందులు తీసుకొచ్చే అంశంగా చెప్పుకోవాలి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.44,150కి చేరింది. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం […]
మేషం:- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వృషభం:- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. ఏ […]
లఖింపూర్ ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రైతుల విషయంలో, దళితుల విషయంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీలోని లఖింపూర్ బాధితులను పరామర్శించిన తరువాత యూపీలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ నేత ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రతో […]
కరోనా తరువాత వివిధ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఈ సంక్షోభం మొదలైంది. దేశంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు ఆందోళనల చేస్తున్నారు. కాగా, పెరిగిన ఈ ధరలపై పాక్ మంత్రి అలీ అమిన్ గందపూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిత్యవసర ధరలు పెరిగాయి కాబట్టి ప్రజలు తక్కువ తినాలని అన్నారు. ద్రవ్యోల్భణం గురించి బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ఈ […]
ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే దేశంలో టీకాలు అందిస్తూ వస్తున్నారు. కాగా, చిన్నారులకు సంబంధించి టీకాలపై భారత్ బయోటెక్ సంస్థ ట్రయల్స్‌ను నిర్వహించింది. కోవాగ్జిన్ టీకాల ట్రయల్స్ పూర్తికావడంతో డేటాను ఇప్పటికే కేంద్రం ఆరోగ్య శాఖకు అందజేసింది. కాగా కేంద్రం ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరు చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ప్యానల్ అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే విపణిలోకి వచ్చే అవకాశం ఉన్నది. డ్రగ్స్ రెగ్యులేటరీ అనుమతి ఇవ్వాల్సి ఉన్నది. డ్రగ్స్ రెగ్యులేటరీ […]
దేశంలో బొగ్గు కొరత కారణంగా రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రాలకు పలు కీలకమైన సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ ను విక్రయిస్తున్నాయని, వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్‌ను అమ్ముకోవద్దని కేంద్రం సూచించింది. ఎక్కువ ధరల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కేటాయించని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొలగిస్తామని […]
ఢిల్లీలో పాక్ ఉగ్రవాదిని స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ దృవపత్రాలతో ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో స్పెషల్ సెల్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు విచారణలో తేలింది. ఈ ఉగ్రవాది నుంచి ఏకే 47, పిస్టల్ తో పాటుగా హ్యాండ్ గ్రెనైడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, జమ్మూకాశ్మీర్‌లోని సోఫియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో […]
దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు సంక్షోభం లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. కాగా, ఈరోజు ప్రధాని మోడి అధ్యక్షతన మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ప్రధాని సమీక్షను నిర్వహిస్తున్నారు. దేశంలోని థర్మల్ […]
ప్రకృతి నుంచి మనిషి ఎన్నో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఉంటారు. పక్షలు చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గూళ్లను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనిషి చెట్లపై గూళ్లు లాంటి హోటళ్లు నిర్మించడం మొదలుపెట్టారు. క్యూబాలోని అడవుల్లో ప్రయోగాత్మకంగా ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటళ్లను నిర్మించారు. ఈ హోటళ్లలో అధునాతనమైన లాంజ్‌లు, గదులు ఉన్నాయి. ఒక ట్రీ టాప్ నుంచి మరోక ట్రీ టాప్ కు వెళ్లేందుకు మధ్యలో చెక్క వంతెనలు ఏర్పాటు చేశారు. వెలిజ్ […]