నేపాల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. దసరా సందర్భంగా వలస కార్మికులు నేపాల్‌లోని గంజ్ నుంచి ముగు జిల్లాలోని గామ్‌గధికి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బస్సు ఛాయనాథ్ రారా పట్టణాన్ని దాటగానే అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడింది. దీంతో బస్సు […]
కాకినాడ మేయర్‌పై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానంలో సభ్యుల విశ్వాసం కోల్పోవడంతో పావని మేయర్ పదవిని కోల్పోయారు. అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై మేయర్ గతంలో కోర్టుకు వెళ్లారు. తీర్మానం ప్రవేశ పెట్టి ఓటింగ్ జరిగినప్పటికీ, ఆ ఫలితాలను ఈనెల 22 వరకు ప్రకటించ వద్దని హైకోర్టు పేర్కొన్నది. కానీ, ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం హడావుడిగా కాకినాడ మేయర్‌ను తొలగిస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. దీనిపై మండిపడ్డ పావని, కేసు […]
ఈనెల 30 వ తేదీన జగరబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు మరింత ఎక్కువగా ఉన్నది. 1900 మంది బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లూకోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హుజురాబాద్ పరిధిలోని […]
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే టీకాలు తీసుకొవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా టీకాలు అమలు చేస్తున్నారు. టీకాలు తీసుకున్నాక శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. టీకాలు తీసుకున్నాక చాలా మందికి కరోనా సోకుతున్నది. అలాంటి కేసులను బ్రేక్‌త్రూ కేసులుగా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతుండటంతో అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. 16 రకాల వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా […]
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం 14 వేల కేసులు నమోదవ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా ఇండియాలో 15,823 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది. ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,07,653 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో […]
హుజురాబాద్‌కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది. హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్‌లో బీజేపీ నాయకులు ప్రచారం […]
దేశంలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. గతంలో సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపే ఉగ్రవాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయక పౌరులు మృతి చెందారు. దీంతో […]
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. ఈరోజు సాయంత్రం గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎంతమంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉన్నది. పోటీనుంచి తప్పుకునే వారు నేరుగా సంతకం పెట్టి నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, 32 మంది […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్లను చూసుకొని ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. రష్యా, పాక్, చైనా మినహా మిగతా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పేదలకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ సమస్య నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడాలి అంటే […]