ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ హౌస్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిథిలోని పవర్ హౌస్‌లను కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి గట్టున ఉన్న పవర్ హౌస్‌ను, సాగర్ కుడి కాల్వ మీదున్న పవర్ హౌస్‌ను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం తన పరిధిలోని పవర్ హౌస్‌లను అప్పగించాకే ఏపీ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని షరతు విధించింది. […]
హుజురాబాద్ నియోజక వర్గానికి ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉన్నది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట్‌లు బరిలో ఉన్నారు. దసరా తరువాత ప్రచారం మరింత పెరగనున్నది. టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం హుజురాబాద్ ఎన్నికపైనే దృష్టిపెట్టింది. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయిందేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక […]
తైవాన్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తైవాన్‌లోని కావోష్యాంగ్ నగరంలో 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. నగరంలోని 13 అంతస్తుల భవనంలో కింది అంతస్తుల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తుండా, పై అంతస్తులు నివాసాలుగా ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందరూ గాఢనిద్రలో ఉండగా […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా పెరగడంతో అశాంతి అధికం అవుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా […]
విజయదశమిని దసరా అని పిలుస్తుంటారు. శరన్నవరాత్రుల్లో చివరి రోజును దసరా పండుగగా జరుపుకుంటాం. దసరా రోజున బొమ్మల కొలువును పెడుతుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఇక భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు దసరా రోజున ముగుస్తాయి. దశకంఠుడిని హరించిన రోజు కూడా కావడంతో ఆ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆశ్వీయుజ మాసం శక్తిపూజకు ఎంతో ముఖ్యమని తంత్రశాస్త్రం ఉపదేశిస్తోంది. పూర్వం […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్కటే కాబూల్‌కు విమానాలు నడుపుతున్నది. కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు నడుస్తున్నాయి. అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన సర్వీసులపై తాలిబన్ల జోక్యం అధికం అయింది. ఈ జోక్యం కారణంగా విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచారు. కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధరను ఏకంగా 2500 డాలర్లకు పెంచారు. గతంలో టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్యలో ఉండేది. […]
పాకిస్తాన్‌లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్భణం అంతకంతకు పెరిగిపోతుండటంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. పాలు, చక్కర, పాలపొడి వంటివి కూడా భారీగా పెరిగిపోతున్నాయి. పాక్‌లో టీని సేల్స్ అధికంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఛాయ్ దుకాణాలు కనిపిస్తుంటాయి. పాక్‌లో ఇప్పుడు రోడ్డు పక్కన ఉండే ఛాయ్ దుకాణాల్లో సింగిల్ కప్పు టీ ఖరీదు రూ.40కి చేరింది. దీంతో వినియోగదారులు టీ తాగాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ఇండియా నుంచి చక్కెర దిగుమతి అవుతుంది. కానీ, రెండు […]