అక్టోబర్ 15, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా పెరగడంతో అశాంతి అధికం అవుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది.
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
మిథునం : ఈ రోజు మీరు ఒక్కోసారి అతి మొండివైఖరి అవలంభించడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. జాగ్రత్త అవసరం.. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహం : ఈ రోజు ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నాలు ముందుకు సాగవు.. కొంతమంది మిమ్మల్న నిరుత్సాహ పరచడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు.
కన్య : ఈ రోజు మీరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఫ్యాన్సీ వ్యాపారస్తులకు పురోభిృద్ధి కానవస్తుంది. మీ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. మీ సంతానం పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
వృశ్చికం : ఈ రోజు ఈరాశిలోని ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోవృద్ధి కానవస్తుంది. విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, కార్మికులు, నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ధనస్సు : ఈ రోజు ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు.
మకరం : ఈ రోజు మీకు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసివస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. రాజకీయ రంగంలో వారికి ఆరోగ్యం లోపం. అధిక శ్రమ ఉంటాయి.
కుంభం : ఈ రోజు మీరు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
మీనం : ఈ రోజు మీరు లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!