ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్కటే కాబూల్‌కు విమానాలు నడుపుతున్నది. కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు నడుస్తున్నాయి. అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన సర్వీసులపై తాలిబన్ల జోక్యం అధికం అయింది. ఈ జోక్యం కారణంగా విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచారు. కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధరను ఏకంగా 2500 డాలర్లకు పెంచారు. గతంలో టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్యలో ఉండేది. మానవతా దృక్పథంలో ఆఫ్ఘన్‌కు విమానాలు నడుపుతున్నామని, బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధప్రాంతంగా పరిగణిస్తున్నందున బామా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, వీటి ప్రభావం టికెట్ల ధరలపై పడుతోందని తాలిబన్లు సైతం చివరి నిమిషంలో ప్రయాణ నిబంధనలు మార్చడం, అనుమతులకు కొర్రీలు పెట్టడం, సిబ్బందిని భయపెట్టే విధంగా ప్రవర్తించడం చేస్తున్నారని పాక్ ఎయిర్ లైన్స్ ఆరోపించింది.