హుజురాబాద్ నియోజక వర్గానికి ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉన్నది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట్లు బరిలో ఉన్నారు. దసరా తరువాత ప్రచారం మరింత పెరగనున్నది. టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం హుజురాబాద్ ఎన్నికపైనే దృష్టిపెట్టింది. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయిందేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించవద్దని కరీంనరగ్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పై ప్రస్తుతం నిషేధం విధించామని, ప్రజా చట్టం ప్రకారం అక్టోబర్ 30 వ తేదీ రాత్రి 7:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని కలెక్టర్ పేర్కొన్నారు.
Read: తైవాన్లో దారుణం… 13 అంతస్తుల భవనం దగ్ధం…46 మంది మృతి…