NTV WebDesk
Author- NTV Telugu-
మార్నింగ్ వాక్ .. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప రాష్ట్రపతి
ఆరోగ్యమే మహాభాగ్యం. ఉదయపు నడక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే డాక్టర్లు ఉదయం వాకింగ్ చేయాలంటున్నారు. స్వంత రాష్ట్ర పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్ చేశారు. విజయవాడ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు ఉదయపు నడకతో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య వారికి సూచించారు. ఆయనే […] -
కర్నూలు జూపాడుబంగ్లాలో విజృంభించిన అతిసార
కర్నూలు జూపాడుబంగ్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో వందలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు,విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురైన 20 మందిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు పిల్లలు వున్నారు. వీరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.జూపాడుబంగ్లాలోని నీలిపల్లె పేటకు చెందిన 20 మంది నందికొట్కూరు ఆసుపత్రిలో చేరారు. ఆరుగురు ఆందోళనకరంగా వుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచి నీరు కలుషితం కావడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు చెబుతున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం.. రైతుల్లో భయం
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్ […] -
అల్పపీడనం ఎఫెక్ట్.. తిరుపతి కాలనీల్లో నడుంలోతు నీళ్ళు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతి జలసంద్రమయింది. తిరుపతి లో భారీ వర్షం కారణంగా చెరువుల మారుతున్నాయి కాలనీలు. తిరుపతి నడిబొడ్డున ఉన్న మధురానగర్ లో వర్షం వల్ల కాలనీలో నీరు నిలిచిపోయింది. లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ళలోంచి రాలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలు కూడా బయటకు వెళ్ళి కొనుక్కోలేని విధంగా వుంది. అధికారులు తమకు సాయం చేయాలని కాలనీల వాసులు కోరుతున్నారు. -
వాహనదారుడిపై కానిస్టేబుల్ వీరంగం.. వైరల్ వీడియో
రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం […] -
పవర్ లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్.. అమర్నాథ్
విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ వైసీపీ నాయకులను నిందించడానికి విశాఖ వచ్చారా? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారో పవన్ సమాధానం చెప్పాలి. 32 […] -
జిన్నాను గాంధీ,సర్దార్‌పటేల్‌తో పోల్చిన అఖిలేష్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను మహాత్మా గాంధీ, సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌లతో పోల్చారు, వారందరూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని అన్నారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ (మహమ్మద్ అలీ) జిన్నా ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. వారు న్యాయవాదులుగా మారి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సిద్ధాంతంపై […] -
సరిహద్దుల నుంచి రైతులను తొలగించొద్దు : గుర్నామ్ సింగ్ చదునీ
ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దులలోని నిరసన ప్రదేశాల నుండి బారికేడ్లను తొలగించిన తరువాత, రైతులను అక్కడి నుండి పంపిచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వెలుపల దీపావళి చేసుకుంటారని రైతు సంఘాల నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని ఆదివారం హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లో ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో రైతుల నిరసన స్థలాల నుండి బారికేడ్లు, ముళ్ల వైర్లను తొలగించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న […] -
మాతృభాషలోచదువుకోవడం అభివృద్ధికి ఆటంకం కాదు: వెంకయ్యనాయుడు
భారత దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే యువతే కీలకమని,మాతృభాషలో చదువుకోవడం అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువత నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ పని చేస్తోందన్నారు. భారత సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలించిందన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరూ మాతృ భాషలో నే […] -
రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారు: షర్మిళ
కేసీఆర్ రాష్ట్రానికిఏం చేశారో చెప్పాలని పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిళ అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉచిత విద్యంటూ విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, వడ్డీ లేని రుణాలంటు డ్వాక్రా మహిళలను, రైతులను, రిజర్వేషన్లు పెంచుతానని మూడెకరాల భూమి ఇస్తానని ఎస్సీ ఎస్టీలను, డబుల్ బెడ్రూంలు ఇస్తానని పేదలను మోసం చేశారని ఆమె అన్నారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు […]
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!