మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా విజయం తరువాత విష్ణు తనకు మద్ధతు తెలిపిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబులు హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్లి పలకరించారు. మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, మంగళగిరిలో టీడీపీ ఓటమిపాలైందని అన్నారు. అయితే, మా […]
ప్రధాని మోడి 2014లో ఛాయ్‌పే చర్చ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఇండియాకు వచ్చే ఇతర దేశాల ప్రతినిధులు, మంత్రులు, అద్యక్షులతో ఛాయ్‌పే చర్చ కార్యక్రమం ద్వారా చర్చలు జరుపుతుంటారు. ప్రధాని తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాయ్‌పే చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉడిపి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి బిజినెస్ ఐడియాల గురించి చర్చించారు. త్వరలోనే అన్ని […]
దేశంలో గత కొన్ని రోజులుగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మహారాష్ట్రలోని 13 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ధర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు నాలుగురోజులకు మించి లేవని, నాలుగురోజులు దాటితే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, ఈ సమస్యను పరిస్కరించకుండే విద్యుత్ సరఫరాకు అంతరాయం తప్పదని రాష్ట్రాలు కేంద్రాని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటి వరకు అనేకమార్లు కేంద్రం దీనిపై సమీక్ష నిర్వహించింది. దేశంలో బొగ్గు […]
ప్రశాంతతకు నిలయమైన యూరప్ ఖండంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడు పేలిపోతాయో అంచనా వేయడం కష్టమే. స్పెయిన్‌లోని సలా పాల్మాలోని టోడోక్ అనే అగ్ని పర్వతం బద్దలైంది. ఈ పర్వతం నుంచి పెద్ద ఎత్తున పొగ, ధూళితో పాటుగా లావా ఎగసిపడుతున్నది. ఆ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న లాపార్మాలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, ఆ గ్రామంలోని కుక్కలను పాఠశాల స్థలంలో తాత్కాలికంగా ఆవాసం కల్పించారు. వీటికి డ్రోన్‌ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అగ్నిపర్వతం […]
దేశం ఏదైనా కావొచ్చు… వేడుకల్లో బంగారం తప్పనిసరి. వారి సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని ఆభరణాలుగా మలచుకొని ధరిస్తుంటారు. పొరుగుదేశం చైనాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లకు పెద్దమొత్తంలో బంగారం వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవలే హుబే ప్రావిన్స్‌కు చెందిన ఓ వధువుకు వివాహం జరిగింది. పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. 60 కిలోల బరువైన ఆభరణాలకు వధువు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో 10 […]
దసరా వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రుల్లో నేడు 8వ రోజు కావడంతో అమ్మవారు మహిషాషిని మర్థని దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. గత ఏడు రోజులుగా బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూలైన్లో ఉన్నారు. శరన్నవరాత్రులు శుక్రవారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వచ్చే భక్తుల కోసం దేవస్థాం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా […]
వైన్ ఎప్పటి నుంచి ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం. పూర్వ కాలంలో వైన్‌ను వివిధ రకాలుగా తయారు చేసుకునేవారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైన్ ఫ్యాక్టరీ బైజంటైన్ కాలానికి చెందినదిగా ఇజ్రాయిల్ పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 1500 ఏళ్ల నాటిదని, అప్పట్లో ఇదే అతిపెద్ద ఫ్యాక్టరీ అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిఏటా […]
సాధారణంగా పండుగ రోజుల్లో చికెన్ ధరలు పెరుగుతుంటాయి. కరోనా సమయం కాబట్టి పోషకాహారానికి డిమాండ్ పెరిగింది. పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండోచ్చని న్యూట్రీషియన్స్ చెప్పడంతో చికెన్‌కు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. చికెన్‌కు డిమాండ్ పెరగడంతో కోళ్ల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టారు. దసరా పండుగ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో చికెన్ కు దూరంగా ఉంటారు. దీంతో కోడి మాంసం వినియోగం తగ్గిపోయింది. కావాల్సన్ని కోళ్లు అందుబాటులో ఉన్నా, కోనుగోలు లేకపోవడంతో […]
సాధారణంగా కార్లు పెట్రోల్, డీజిల్ తో నడుస్తుంటాయి. ప్రస్తుతం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, బ్రిటన్ యువరాజు ఛార్లెస్ నడిపే కారు మాత్రం అన్నింటి కంటే డిఫరెంట్‌గా నడుస్తుంది. బ్రిటన్ యువరాజు ఛార్లెస్‌కు 51 ఏళ్ల క్రితం ఆస్టిన్ మార్టిన్ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఆ కారును ఇప్పటికి మోడలింగ్ చేయించి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, డిజిల్ కాకుండా మద్యంతో […]