అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ చేజిక్కించుకున్నది. ఎయిర్ ఇండియా సంస్థను టాటాలే స్థాపించారు. ఆ తరువాత అందులో భారత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంతో అది ప్రభుత్వరంగ సంస్థగా మారింది. కాగా, ఇప్పుడు ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో తిరిగి టాటాలు బిడ్‌లో దక్కించుకున్నారు. తాము స్థాపించిన సంస్థ తిరిగి టాటాలకు చేరడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న రతన్ టాటాకు ముంబైలోని సర్ రతన్ టాటా ఇనిస్టిట్యూట్ […]
పండుగల వేళ కూరగాయలు, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుంటే, వంటనూనె ధరలు మాత్రం తగ్గుముఖం పట్టేఅవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వంటనూనె ధరలను నియంత్రించేందుకు కేంద్రం సుంకాలను తగ్గించింది. పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్టు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు ఉత్తర్వులను జారీ చేసింది. వ్యవసాయ సెస్ లో కోత విధించడంతో మూడి నూనె ధరలు దిగి వస్తున్నాయి. లీటర్‌కు రూ.12 నుంచి రూ.15 వరకు తగ్గే […]
కరోనాకు ముందు ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రతీ రంగంలో పోటీపడి విజయం సాధిస్తూ వచ్చాయి. ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయిందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు ఆర్థికంగా కుదేలయ్యాయి. కరోనా వల్ల కుదేలవుతున్న ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టేందుకు వివిధ దేశాలు పాలసీలు, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. దీని వలన రికార్డ్ స్థాయిలో ప్రపంచ దేశాల […]
మేషం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు అధికమవుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గృహంలో మార్పులు, మరమ్మతులు చేపడతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ […]
రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపై కేంద్రం పెత్తనం మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు అవకాశం ఇస్తున్నాయని, దీని వలన రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పొన్నాల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులను ప్రారంభించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు. లక్షకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం జరుగుతున్నదో కేసీఆర్ చెప్పగలరా […]
బొగ్గు దెబ్బమీద దెబ్బ కొడుతున్నది. దక్షిణాదిన బొగ్గు సమస్యలు ఉన్నప్పటికీ ఉత్తరాదితో పోలిస్తే తక్కువే అనిచెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాలు బొగ్గు సమస్యతో అట్టుడికిపోతున్నాయి. డిమాండ్ ఉన్న విద్యుత్ కంటె తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో షార్టేజ్ వస్తున్నది. ఫలితంగా వినియోగదారులకు కోతలు విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోతలు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఉంటోంది. ఇక బొగ్గు సంక్షోభంతో పంజాబ్ రాష్ట్రం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. అక్టోబర్ 11 వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో ఏకంగా […]
కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు రాష్ట్రపతిని కలిశారు. లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. ఘటనపై స్వతంత్ర బృందంచేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కోరారు. అంతేకాకుండా, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రం అందజేసిన తరువాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖింపూర్ ఘటనలో […]
టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, పట్టణ కమిటీలు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైనట్టు కేటీఆర్ తెలిపారు. 2019 ఎన్నికల కారణంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమం నిర్వహించలేకపోయామని, ఆ తరువాత కరోనా కారణంగా రెండేళ్లపాటు ప్లీనరీని నిర్వహించలేదని, నవంబర్ 15న వరంగల్‌లో విజయగర్జన జరుగుతుందని అన్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. అక్టోబర్ 17 వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ […]
దేశంలో బొగ్గునిల్వల సమస్య ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే విద్యుత్ సంక్షోభం ఏర్పడవచ్చని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై నిన్నటి రోజుక కేంద్రం ప్రధాని నేతృత్వంలో సమీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం దేశంలోని బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలో మొత్తం 116 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు […]