కేసీఆర్ అసమర్థతతోనే ప్రాజెక్టులన్ని సమాధి అవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయనా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై NGT స్టే ఇచ్చిందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి చూశారు .. ఇప్పుడు పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కేసీఆర్‌కు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం అసమర్థత […]
మొన్న లద్దాక్..నేడు తవాంగ్ ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు చైనా సరిహద్దుల్లో భారీ బందోబస్త్‌ను భారత్ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో భారత్ భూటాన్, టిబెట్‌లకు ఆనుకుని ఉన్న తవాంగ్ ప్రాంతం పై చైనా కన్ను పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశపూర్వకంగా అక్కడి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనాకు ధీటుగా జవాబు చెప్పేందుకు అమెరికా తయారు చేసినా […]
ఏపీ మీదుగా తెలంగాణకు వస్తున్న గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిట్యాల వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీలో 100 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా దానిని సీజ్ చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏవోబీ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తోంది ముఠా. ఎస్పీ […]
విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతు మహాజన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్నారు. భీమసింగిలో ఉత్పత్తి చేసిన చక్కెరను వివిధ హిందూ దేవాలయాల్లో ప్రసాదానికి వాడేందుకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విధంగా […]
ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడులకు పాల్పడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. పోలీసుల దాడిలోకార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయ న్నారు. ఒక నాయకుడికి కాలు విరిగిందని, ఇంకో నాయకుడి మెడపై తీవ్రగాయమైనట్టు ఆయన తెలిపారు. గాయపడ్డ కార్యకర్తలను తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆయన అన్నారు. వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేశారని వారు ఏం పాపం చేశారని బండి సంజయ్ […]
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఉక్క పరిశ్రమను కాపాడుకుంటాం అంటూ విశాఖలో జనసైనికులు నినాదాలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రాంగణం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభకు సిద్దమయ్యారు జనసేన నాయకులు, కార్యకర్తలు. అయితే, ప్రాంగణంను మరొక చోటుకి బదిలీ చేయలంటూ పోలీసులు హుకుం జారీచేశారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్రా ఇంచార్జ్ తమ్మారెడ్డి శివ శంకర్ పోలీసుల […]
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదం రోజు రోజుకు హీట్ పుట్టిస్తుంది. మొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏ పంట వరి పంట వేయోద్దని వరి విత్తనాలు అమ్మొద్దని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం ఫైర్ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై మండి పడ్డారు. రైతుల జోలికి వస్తే ఊరుకోమని కలెక్టర్‌ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజగా ధాన్యం కొనుగోళ్లపై […]
మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువగా ఉండడం అసలు మంచిదికాదు. ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోకపోతే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు […]
ఎన్ని ప్రమాదాలు జరగుతున్న వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వేగం కన్నా ప్రాణం మిన్నా అనే సూత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తమవి పెద్ద పెద్ద బండ్లు అనో, ఖరీదైన బైకులు, కార్లను స్లోగా నడిపితే ప్రయోజనం ఏంటని అనుకుంటున్నారో తెలియదు కానీ రోజు రోజుకు వాహన ప్రమాదాలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఎంతో జీవితం ఉన్న యువతీ, యువకులు మధ్యలోనే జీవితాన్ని ముగించాల్సి వస్తోంది. కొంచెం లేటైనా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న విషయాన్ని మరిచిపోతూ […]
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కీసర బ్రిడ్జి పై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా యువతి. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపింది. అనంతరం నది నీటిలోకి దూకింది యువతి. ఈ విషయం గమనించి రక్షించారు స్థానిక యువకులు. అనంతరం 108 వాహనంలో నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. స్థానికులు సకాలంలో స్పందించడంతో […]