కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్పన్ ఆర్‌కె రోజా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని తెలిసి చాలా బాధపడ్డాను. షాక్ అయ్యాను. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. వియ్ విల్ మిస్ యూ అంటూ రోజా ట్వీట్ చేశారు. […]
క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అవుతుంది. టెస్టు క్రికెట్ నుంచి మొదలు పరిమిత ఓవర్లు, టీ20 దాకా అన్ని అద్భుతాలే మరీ.. ఇలా అద్భుతాలు చేస్తుంది కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు అంత మంది అభిమానులు ఉన్నారు. మరీ.. తాజాగా క్రికెట్ చరిత్రలోనే మొదటి సారిగా పురుషుల క్రికెట్ జట్టుకు ఓ మహిళా కోచ్‌గా సేవలు అందించనుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సారా టేలర్.. పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. టీ10 […]
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు. పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై […]
పోడు రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజనులు కోట్లాడుతున్న ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయలేదు. ఎన్నో సార్లు పోడు భూములపై ఇటు ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం నడిచింది. కొన్ని సార్లైతే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఖమ్మంలోని కారేపల్లిలో పోడు సాగు చేస్తున్నందుకు అడ్డుకున్న బాలింత మహిళలపై అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపించారు. దీనిపై హ్యుమన్‌రైట్ కమిషన్, పలు మహిళా సంఘాలు సీరియస్ […]
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీలు చేయడం కలకలం రేపింది. అయితే, జిల్లా రిజిస్ట్రార్ పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను అధికారులు అనుమతించలేదు. వీడియోలు తీసేందుకు నిరాకరించారు అధికారులు. సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా ఓ రిపోర్టర్ చేతిలో నుండి ఫోన్ తీసుకుని వీడియోలు తొలగించారు అధికారులు. శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహింనట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ […]
రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన భాషా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్..లక్ష్మీ పార్వతి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుకు ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషమీద, సంస్కృతం మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయయని వీటిని అధిగమించేందుకు, వివరంగా తెలుసుకునేందుకు యూనిర్సిటీల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. సంస్కృతం అనే పదం చేర్చడం వలన వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు […]
ఏపీలో అమరావతి రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ న్యాయవాది. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించారు న్యాయవాది వి.లక్ష్మీనారాయణ. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది హైకోర్ట్. రైతుల […]
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ మరణం నన్ను షాక్ కి గురి చేసింది.కన్నడ సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో లక్షలాది మంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం. పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ […]
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం. ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్ […]
ఏళ్లు గడిచే కొద్ది ఎన్డీఏ( నేషనల్ ఢిపెన్స్ అకాడమీ) అభివృద్ధి చెందుతుందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎన్డీఏ 141వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏలో మహిళల ప్రవేశంతో వారికి సాధికారత లభిస్తుందని తెలిపారు. రానున్న 40 ఏళ్లలో వారు ప్రస్తుతం తానున్న హోదాలో ఉంటారని తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది ఎన్డీఏలో కరిక్యూలం మారుతోంది. శిక్షణ పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కోర్సు కటెంట్లో […]