సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ కోర్టులో లొంగిపోయాడు. ఎల్బీనగర్ కోర్టులో హన్మంత్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా హన్మంత్ వున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్‌లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్నాడు హన్మంత్ రెడ్డి. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు బాలానగర్ పోలీసుల […]
గోదావరి – కావేరి జలాల అనుసంధానం కోసం ఆయా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించినట్టు ఎన్ డబ్య్లూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని కోసం డీపీఆర్‌తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హిమాలయ బేసిన్లో ఉన్న మిగులు జలాలను దక్షిణానికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. గోదావరి – కావేరి లింక్ కోసం ఇప్పటికే డీపీఆర్ రూపొందించినట్టు వెల్లడించారు. దీనిని అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ అందించామని దీనిపై ఆయా రాష్ట్రాలు తమ […]
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్. ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే.. […]
కడప జిల్లా బద్వేల్‌లో శనివారం పోలింగ్ జరగనుంది. ఇదిలా వుంటే బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. దీంతో బద్వేల్ ఉపఎన్నిక చల్లటి వాతావరణంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు, ఇతర అధికార సిబ్బంది. వర్షం కురుస్తున్నా పోలీస్ వాళ్ళు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు మరికొద్ది గంటల్లో జరిగే బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్దం చేసింది అధికారయంత్రాంగం. బద్వేల్ ఉపఎన్నిక లో మొత్తం 281 […]
చిన్నప్పుడు చెప్పిన మాటలు పెద్దయ్యాక ప్రభావితం చేస్తుంటాయి. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా, ఆ మాటల ప్రభావం మనిషిపై తప్పనిసరిగా ఉంటుంది. ఆ వైపే మనిషిని నడిపిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. చిన్నతనం నుంచే భూపాల్‌కు చెందిన సుయాస్ కేసరీ అనే వ్యక్తికి వైల్డ్‌లైఫ్ జంతువులంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. చిన్నతనంలో సుయాస్ అమ్మమ్మతో కలిసి జూకి వెళ్లాడు. ఎన్‌క్లోజర్‌లో ఉన్న జంతువులను చూసి కేరింతలు కొట్టారు. నువ్వు ఆనందంగా ఉన్నావు..కానీ, అవి […]
పెళ్లి వేడుకలకు వందలాది మంది అతిథులు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తుంటారు. మెక్సికోలోని న్యూవో లియోన్ పర్వత ప్రాంతంలో ఇటీవలే ఓ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అతిథుల కోసం రిసెప్షన్ హాలులో భోజనం ఏర్పాట్లు చేశారు. అందరూ భోజనాలు చేస్తుండగా అనుకోని అతిథి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి జనాలు హడలిపోయారు. అయితే, వారిని ఏమి చేయని ఆ అతిథి ఎలుగుబంటి అక్కడ ఉన్న […]
ఐస్‌క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. ఇష్టంగా తీసుకుంటుంటారు. ఎన్నో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండేందుకు రకరకాల ఫ్లేవర్లను తయారు చేస్తుంటాయి. అన్ని కంపెనీలలోకి బెన్ అండ్ జెర్రీ కంపెనీ వేరుగా ఉంటుంది. యూఎస్‌లోని వెర్మెంట్‌లో వాటర్‌బర్నీ అనే గ్రామంలో 1978లో బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను స్థాపించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను తయారు చేసేవారు. వినియోగదారులకు నచ్చని ఐస్‌క్రీమ్‌లకు వాటి ఫ్లేవర్ల రూపంలోనే పార్లర్‌సమీపంలో సమాధి చేసేవారు. సమాధిపై ఆ ఐస్‌క్రీమ్‌ను […]
నాలుగు రోజులుగా కోడిపుంజులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాయి. వాటికి బియ్యం అందిస్తూ పోలీసులు జాగ్రత్తగా చూస్తున్నారు. వాటి రంగుల ఆధారంగా మూడు పుంజులను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలోని దంతలబోరు శివారులోని అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోడిపందేలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని, మూడు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే, […]
కరోనాకు పుట్టినిల్లు చైనా. చైనాలోని ఊహాన్ నగరంలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ప్రపంచవ్యాప్తమైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తూనే ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినా కేసులు కంట్రోల్‌కావడం లేదు. కరోనా కొత్తగా రూపాంతరం చెందుతూ ఎటాక్ చేస్తున్నది. తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వచ్చినట్టుగా కరోనా కేసులు […]
గత రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నది. రష్యా, చైనా, న్యూజిలాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్నటి రోజున రష్యాలో ఏకంగా 40,096 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1159 మంది కరోనాతో మృతి చెందారు. రష్యాలో అత్యధికంగా నమోదైన కేసులు ఇవేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అక్టోబర్ 30 వ తేదీ […]