ఎన్ని ప్రమాదాలు జరగుతున్న వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వేగం కన్నా ప్రాణం మిన్నా అనే సూత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తమవి పెద్ద పెద్ద బండ్లు అనో, ఖరీదైన బైకులు, కార్లను స్లోగా నడిపితే ప్రయోజనం ఏంటని అనుకుంటున్నారో తెలియదు కానీ రోజు రోజుకు వాహన ప్రమాదాలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఎంతో జీవితం ఉన్న యువతీ, యువకులు మధ్యలోనే జీవితాన్ని ముగించాల్సి వస్తోంది.
కొంచెం లేటైనా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న విషయాన్ని మరిచిపోతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. అతి వేగంగా వెళ్లి గతేడాది తెలంగాణలో 5,460 మంది ప్రాణాలు కోల్పోయారు. అతి వేగానికి ప్రాణాలు కోల్పోతున్నా వాహనదారుల్లో కొంచెం కూడా భయం కన్పించకపోవడం దారుణం.
ఓ వైపు ప్రభుత్వం ప్రమాదాల నివారణకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా వాహనదారుల్లో చలనం కలగటం లేదు. ట్రాఫిక్ నియామాలు సైతం పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా కనిపిస్తుంది. ఇక తాజగా మొత్తం రాష్ట్రంలో 19,505 రోడ్డు ప్రమాదాలు జరగగా ..1,219 మంది మృత్యువాత పడినట్టు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో వెల్లడించింది. వారిలో అతివేగానికి 5,460 మంది, మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల 1,328 మంది చనిపోయినట్లు వెల్లడించింది.