బద్వేలు ఉప ఎన్నికల్లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలువురు నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపలు వస్తున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చటు చేసుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో 103 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఈసీకి ఫిర్యాదు చేశామని స్థానిక నేతలు తెలిపారు. పలువురు దొంగ ఓటర్ ఐడీలతో వైసీపీ ఓట్లు వేయించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో 58, […]
కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించిన ఆత్మకూరు వర్ధన్ సొసైటీ మోసాలపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. సబ్సిడీ రుణాల పేరుతో సుమారు 3 కోట్ల 63 లక్షల రూపాయలను సేకరించారని ఎస్పీ వెల్లడించారు. ఎమ్మిగనూరుకి చెందిన మహేష్ కుమార్ అలియాస్ జాషువా తన సంస్థ ద్వారా సేకరించినట్లు తేలిందన్నారు. 2 కోట్ల 70 లక్షలు దుర్వినియోగానికి సాక్ష్యాలు లభించాయని, డబ్బు అధికశాతం సొసైటీ ప్రధాన నిర్వాహకుడు మహేష్ కుమార్ అలియాస్ జాషువా […]
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయిని మించిన హాట్ టాపిక్ లేదు. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి విద్యాసంస్థలకు సరఫరా అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి,కాఫ్ సిరప్,టాబ్లెట్స్ లను విద్యాసంస్థలే లక్ష్యంగా యువతకు అమ్ముతున్న ముఠా ను 29వ తేదీన 2వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. విముక్తి కాలనీ సమీపంలో ఒక పాడుబడిన హాస్పిటల్ ప్రాంగణంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. మట్టి విజయ్ కుమార్ […]
ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎయిడెడ్ పాఠశాలల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అనంతపురం నగరంలోని గిల్దాఫ్ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా పేద విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్నామని, […]
నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన మహాగర్జన సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిందించడమే పరమావధిగా పెట్టుకున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వాలు తొందరగా పూర్తి చేసుకున్న […]
సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు ఉపసంహరణ కానున్నాయన్నారు. అన్నదాతల సత్యాగ్రహం భేష్ అంటూ ట్వీట్ చేశాడు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోఏడాదిగా మూతపడిన ఢీల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దులను అధికారులు ఇవాళ తెరిచారు. రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీతో ఎన్నికలకు సమయం […]
ఇన్నాళ్ళ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్‌పై అంతా ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికలలో ఈటల రాజేందర్ … అప్పటి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు టీఆర్‌ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా […]
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న నటీనటులు తీవ్రంగా కదిలిపోయారు. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనతో కలిసి వున్న ఫోటోలు షేర్ చేశారు బన్నీ. ఖచ్చితంగా ఇది నాకు పెద్ద షాక్. ఆనష్టాన్ని మాటల్లో చెప్పలేను. నా పాత స్నేహితుడు పునీత్ గారు ఇక లేరు. మేము ఒకరికొకరం పరస్పర గౌరవం. ఇష్టంతో వుండేవాళ్ళం. ఇప్పటికీ […]
అదేదో సినిమాలో రాజేంద్రప్రసాద్. నీకు చెబితే నాకేంటి? అంటూ వుంటాడు. అచ్చం అలాంటి సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి అచ్చం మనిషిలాగే ప్రవర్తించింది. నీకిస్తే నాకేమిస్తావ్? అన్నట్టుగా ప్రవర్తించింది. దారిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అక్కడే ఓ ఐరన్ గ్రిల్ పై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్ళజోడుని లాగేసుకుంది. కోతి దగ్గర కళ్ళజోడు వున్న సంగతి తర్వాత గ్రహించాడు ఆ బాటసారి. కానీ ఆ కోతి దానిని […]
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి జాయింట్ స్టాఫ్ మీటింగ్ పై ముగిసిన సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ భేటీ సుమారు మూడున్నర గంటలకు పైగా కొనసాగింది. కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోకపోగా తూతూ మంత్రంగా సమావేశం జరిగిందని ఆయా ఉద్యోగాల సంఘాల నాయకులు ఆరోపించారు. పీఆర్సీ పై స్పష్టత లేదు. 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు పీఆర్సీ పై వారం రోజుల్లో కమిటీ వేస్తామని చెప్పారు. […]