మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎస్‌ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా వారు వైసీపీ పై ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో అధి కార దుర్వినియోగాని పాల్పడుతున్నారని వారు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. కొండపల్లి, కుప్పం, నెల్లూరుల్లో ఎన్నికల ప్రచారంలో వార్డు వలంటీర్లు పాల్గొంటున్నారని ఎస్‌ఈసీ దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు. వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారంటూ ఆధారాలు ఎస్‌ఈసీకి సమర్పించినట్టు టీడీపీ నేతలు తెలిపారు.
ఎస్‌ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా వాలంటీర్లు, అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజంపేట, కమలా పురం మున్సిపల్ ఎన్నికల్లో కోడ్‌కు విరుద్ధంగా అధికార పార్టీ వ్యవహ రిస్తోందని ఎస్‌ఈసీకి రాసిన లేఖలో టీడీపీ పేర్కొంది. ఉద్యోగ వ్యవహ రాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి రాజంపేట, కమలాపురం మున్సిపా ల్టీల పరిధిలోని ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేయడం కోడ్ ఉల్లంఘన కిందే వస్తుందని టీడీపీ ఫిర్యాదులో తెలిపింది. కోడ్ ఉల్లం ఘనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని టీడీపీ కోరింది.