పాములు కనిపించగానే హడలిపోతాం. వీలైతే అక్కడినించి పారిపోతాం. పాము కరుస్తుందేమోనని దాన్ని చంపేస్తాం. కానీ ఓ నాగుపాము హాయిగా పూజగదికి వచ్చేసింది. అయ్యప్పస్వాముల పూజ ఆసాంతం చూసింది. భజన వింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం లింగాలపాడు గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములు భజనలు చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది ఓ నాగుపాము.
అయ్యప్ప స్వాములు చేస్తున్న భజన కీర్తనలు వింటూ పైన ఏర్పాటు చేసిన దేవతామూర్తల చిత్రపటం వద్దకు చేరుకొని పడగ విప్పి భజన పూర్తి అయ్యేంతవరకూ అక్కడే ఉండిపోయింది. పూజ అనంతరం అయ్యప్ప స్వాములు దగ్గరలో ఉన్న పొదల్లోకి నాగు పామును పంపేశారు.