దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా డాక్టర్ అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేశారు దానం. దళిత బహుజన మైనారిటీ వర్గాలకు దానం విశేష సేవలందించారని సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.