ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత […]
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో […]
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్‌లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39 […]
దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్ దుర్ఘటనకు యూనియన్ కార్బైడ్ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక […]
తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ […]
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఏపీ పీసీసీ చీఫ్ శైలజా నాథ్ చురకలు అంటించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి పీకేది కాదని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు. ఏపార్టీ డబ్బులు ఇస్తే.. […]
ఏపీ సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సరస్వతి నగర్లో జగన్ బాధితులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో సీఎం వైయస్ జగన్ ను కలిశారు కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు. […]
విద్యుత్ సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ కమిటీలు ఈ మేరకు తీర్మనాం చేశాయి. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. డిసెంబర్ 8న ప్రధాన మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో పాటు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాల అందజేయనున్నట్టు వారు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు మద్దతు […]
ఇటీవల జరిగిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన అనుభవాలు, ఫలితాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయన్నారు. గతంలో టీడీపీ నంద్యాల ఉప ఎన్నికలోనూ.. ఆ తర్వాత కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. కానీ ఏడాది తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ […]
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పై మాటల తూటాలతో దాడి చేశారు. చంద్రబాబు చేసిన మోసాలు, మార్చిన రంగులను ఎవ్వరూ మర్చిపోరన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో కూడా చంద్రబాబు మనుషులు ఉన్నారన్నారు. ఎన్టీరామారావు కుటుంబాన్ని మొత్తం వాడుకున్నాడు. చంద్రబాబు ఏడవడానికి ఒక వేదిక కావాలి. వంశీ చేసిన కామెంట్ ఆయన స్వంతంగా పెట్టింది కాదు. అది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉంది […]